కాపాడుతుంది అనుకుందే విషం అవుతోందా ?

-

ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారి తో పోరాడుతూ ఉంటున్న దేశాలకు మొదటిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఓ ఆశా ద్వీపంగా మారింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చాలా దేశాల ప్రముఖుల నాయకులు ప్రతి ఒక్కరు మాట్లాడింది హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ డ్రగ్ గురించే. ఇండియాలో ఎక్కువగా సరఫరా అయ్యే ఈ మందు కరోనా వైరస్ విషయంలో ‘గేమ్ చేంజర్’ అని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. దీంతో అమెరికా సహా యూరప్ దేశాలు  చాలావరకు ఇండియాని కోరడంతో మన దేశం ఈ మెడిసిన్ నీ పెద్ద ఎత్తున పంపిణీ చేసింది.అయితే తాజాగా ఈ డ్రగ్ వాడుతున్న యూరప్ మరియు అమెరికా దేశాలలో సైడ్ ఎఫెక్ట్స్ తీసుకువస్తూ ప్రజలకు విషం లాగా  మారుతూ కొత్త వ్యాధులు తీసుకు వస్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది. దీంతో అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై పరిశోధన చేసి ఈ డ్రగ్ వాడొద్దని హెచ్చరించింది.

 

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడకం వల్ల గుండె సంబంధిత వ్యాధులు సంక్రమించే ప్ర‌మాదం ఉందని అమెరికా వైద్య నిపుణులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడొద్దని కొత్త ఆర్డర్స్ పాస్ చేశారు. చాలా దేశాలు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కాపాడుతుంది అని ఆశలు పెట్టుకున్న వాళ్లకి ఇలాంటి చేదు వార్తలు రావడంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version