మే రెండో వారానికి లక్ష మందికి కరోనా…?

-

మన దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశాలు కనపడటం లేదు. కరోనా తీవ్ర స్థాయిలో విస్తరించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. మన దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1700 కి చేరుకుంది. గత 24 గంటల్లో 200 మందికి పైగా కరోనా బారిన పడ్డారు. అన్ని రాష్ట్రాలకు కరోనా వైరస్ విస్తరించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 మందికి కరోనా సోకింది.

ఇక మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ సహా పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. అక్కడ ఇది ఇప్పుడు అదుపులోకి వచ్చే అవకాశాలు లేవు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ అమలు చేస్తున్నా సరే కరోనా విస్తరించడం ఇప్పుడు భయపెడుతుంది. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన మత ప్రార్ధనలు ఇప్పుడు దేశాన్ని భయపెడుతున్నాయి. వారి వలన కరోనా కేసులు పెరిగాయి.

ఇక ఇది పక్కన పెడితే వచ్చే నెల రెండో వారానికి కరోనా కేసులు లక్షకు చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కరోనాకు ఎండల వలన వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని దాన్ని ఎండలు ఏ మాత్రం అడ్డుకునే అవకాశం లేదని, కేసులు మరింతగా పెరుగుతాయని అంటున్నారు. దీనితో ఇప్పుడు వైద్యుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వైద్యులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version