కరోనా లోన్స్.. ఈ బ్యాంకులు ఇస్తున్నాయి..!

-

కరోనా వైరస్ నేపధ్యంలో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎన్నో విధాలుగా ఎదుర్కొంటున్నారు. రూపాయి రూపాయి దాచుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకు లకు మారిటోరియం విధించాలని సూచించింది. ఇక డబ్బు అవసరం ఉన్న వారికి కరోనా రుణాలు ఇవ్వాలని బ్యాంకు లు ముందుకి వచ్చాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్-PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా-BoB,

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర-BoM, బ్యాంక్ ఆఫ్ ఇండియా-BoI లాంటి బ్యాంకులు కరోనా వ్యక్తిగత లోన్స్ ని తక్షణమే తీసుకునే విధంగా పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. వీటి వడ్డీ రేట్లు 15% వరకు ఉంటాయని సదరు బ్యాంకు లు చెప్పాయి. పర్సనల్ లోన్ తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్ 650 పాయింట్లు ఉండాలని… వారు రూ.3,00,000 నుంచి రూ.5,00,000 వరకు లోన్ తీసుకునే సదుపాయం ఉంటుంది.

వీటిని ఇప్పటికిప్పుడు ఇస్తామని చెప్తున్నాయి. తమ బ్యాంకులో సాలరీ అకౌంట్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఉన్నవారికి ఈ లోన్స్ ఇస్తారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌజింగ్ లోన్ ఉన్నవారికి, బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్, కార్, పర్సనల్, ఎడ్యుకేషన్ లాంటి లోన్లు తీసుకున్నవారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. కనీసం ఆరు నెలలు తమ కస్టమర్ గా ఉండాలని చెప్తున్నాయి బ్యాంకు లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version