CORONA : రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ.

-

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో తాజాగా నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా భేటీ అయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసులపై అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించనున్నారు. వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, వ్యాక్సినేషన్ గురించి చర్చించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రం వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మండవీయ కూడా హాజరయ్యారు.

దేశంలో కోవిడ్ పరిస్థితులతో పాటు… క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాష్ట్రాల సీఎంలకు యూటీ లెఫ్టినెంట్ గవర్నర్లకు దిశానిర్థేశం చేయనున్నారు ప్రధాని. ఇప్పటికే బెడ్లు, ఆక్సిజన్ సిద్దం చేసుకోవాలని రాష్ట్రాలకు యూటీలకు కేంద్రం ముందుజాగ్రత్త సూచనలు చేసింది. మరోవైపు పండగలు వస్తున్న క్రమంలో రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై చర్చించే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాల వేగం పెంచడంతో పాటు టీనేజర్లకు, రిస్క్ ఎక్కువగా ఉన్న వయసు పైబడిన వారికి ప్రికాషనరీ డోసుల త్వరగా వేయాలని ఈ సమావేశంలో రాష్ట్రాలు/ యూటీలకు సూచించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version