ప్రపంచంలో కరోనా వైరస్ తో పోరాడే విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు అని చెప్పబడేవి డీలా పడిపోయాయి. చాలావరకు ఆ దేశాలు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అగ్ర రాజ్యాలు అని చెప్పుకునే దేశాలు కూడా కరోనా వైరస్ ముందు తేలిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో గట్టిగా పోరాడుతున్న దేశంగా మారుమోగుతున్న పేరు ఇండియా. మనదేశంలో కేంద్ర ప్రభుత్వం వైరస్ దేశంలో ప్రవేశించకముందే లాక్ డౌన్ అమలు చేయటంతో చాలా వరకు కట్టడి చేయగలిగారు. ఇండియాకి పక్కనే ఉండే చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇండియాలో కాకుండా యూరప్ దేశాలలో విజృంభించడం పట్ల అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అధ్యక్షుడు పుతిన్ తీసుకున్న నిర్ణయాల వల్లే రష్యా దేశం లో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉందని అప్పట్లో వార్తలు గట్టిగా వచ్చాయి. ఇటువంటి సమయములో ఏప్రిల్ మొదటి వారం నుండి ఇప్పటి వరకు 90 వేలకు పైగా పాజిటివ్ కేసులు బయటపడటంతో రష్యాలో కేసులు ఈ విధంగా పెరగటానికి గల కారణం కి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో కొంతమంది నిపుణులు రష్యా దేశంలో వాతావరణం కరోనా వైరస్ కి అనుకూలంగా ఉంటుంది, ఇండియా లో వాతావరణం అనుకూలంగా లేదు. కాబట్టి వేల కేసులు రష్యాలో నమోదవుతున్నాయి అని అంటున్నారు.