కరాచీ బేకరీలో భారీ దొంగతనం…!

-

హైదరాబాద్ నగరంలో మొజామ్‌జాహి మార్కెట్‌లో భారీ దొంగతనం జరిగింది. ఎంజే మార్కెట్ సమీపంలో ఉన్న ఒక కరాచీ బేకరీలో దొంగలు రూ.10లక్షల నగదు దోచుకుని పారిపోయారు. ఇక్కడ షాక్ ఏంటీ అంటే ఈ దొంగతనం పోలీస్ చెక్ పోస్ట్ సమీపంలోనే జరగడం విశేషం. ఇక్క బేకరీ చాలా ఏళ్ళుగా కొనసాగుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా దాన్ని తెరుస్తున్నారు.

బుధవారం ఉదయం బేకరీని తెరిచిన యజమానులు లాకర్‌ పగులగొట్టి ఉండటం అందులో ఉండాల్సిన రూ.10లక్షల నగదు కనపడకపోవడంతో షాక్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన ఏప్రిల్ 24 న జరిగింది. దొంగ దుకాణంలోకి ప్రవేశించడం మరియు కౌంటర్ నుండి డబ్బును దోచుకోవడం వంటి దృశ్యాలను పోలీసులు సీసీ కెమెరా లో గుర్తించారు. నిందితులను గుర్తించడానికి పోలీసులు సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఈ నేరానికి ముగ్గురు వ్యక్తులు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బేకరీలో పనిచేసే వారి సహాయం లేకుండా ఇలాంటి దోపిడీ సాధ్యం కాదని ఇన్స్పెక్టర్ చెప్పారు. నేరస్థులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ బేకరీ వెనుక భాగంలో కెమెరాలు లేవు. దీనిపై ఇప్పుడు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు పది లక్షలు అక్కడ ఎందుకు ఉంచారు అనే అనుమానం వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version