విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్?

-

గతేడాది ఇంగ్లాండ్ తో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టు ఆడేందుకు యూకే కి వెళ్ళిన టీమిండియా క్యాంపు లో కరోనా కలకలం మొదలైంది. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కంటే ముందే ఇండియాలోని పలువురు ఆటగాళ్ళు కరోనా బారిన పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. భారత జట్టు ఇంగ్లాండ్ కు బయలుదేరే కంటే ముందే టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కరోనా పాజిటివ్ గా తేలిందని బిసిసిఐ వర్గాలు స్పష్టం చేశాయి.

ఐపీఎల్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లారు కోహ్లీ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీకి కోవిడ్- 19 పాజిటివ్ గా తేలిందని, అయితే ఆ తర్వాత అతడు కోలుకునే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంగ్లాండ్ కు వెళ్లడానికంటే ముందు భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా కరోనా సోకడంతో అతను ఆలస్యంగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అశ్విన్, కోహ్లీ లతో పాటు మరికొంతమంది టీమిండియా ఆటగాళ్లకు కూడా వైరస్ సోకినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై టీం మేనేజ్మెంట్ అధికారిక ప్రకటన ఏదీ విడుదల చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version