ప్రపంచ వ్యాప్తంగా కరోనా రెండో దశ ప్రభావం మొదలైంది..చాలా దేశాలు ఇప్పటికే దాని తీవ్రతతో అతలా కుతలం అవుతున్నాయి..కొన్ని దేశాలు మళ్లీ లాక్ విధించాయి..మరోకిన్ని దేశాలు పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నారు..కరోనా బారిన పడిన దేశాలు అంతో ఇంతో కోలుకున్నా..అమెరికా, భారత్‌లో పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు..ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి..అమెరికాలో కేసులు కోటి పాతిక లక్షలు దాటాయి. ప్రపంచంలోని వంద దేశాల్లో ఉన్న మొత్తం కేసుల కంటే ఇది చాలా ఎక్కువ. గత వారం రోజుల్లోనే అమెరికాలో లక్ష మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు.
అమెరికాలో వారం రోజుల వ్యవధిలోనే పదకొండు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాడంతో.. దేశంలోని పలు నగరాలు మళ్లీ లాక్‌డౌన్ దిశగా సాగుతున్నాయి..వైరస్ విజృంభిస్తుండటంతో కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే 11 మిలియన్ల నుంచి 12మిలియన్లకు కరోనా కేసులు చేరాయి. దీంతో వచ్చే రెండు మూడు వారాలపాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తిచేస్తున్నారు. డిసెంబర్‌లో క్రిస్మస్ పండగ, నూతన సంవత్సర వేడుకలు, విహారయాత్రల వల్ల వైరస్ విజృంభణ మరింత ఎక్కువయ్యే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
అమెరికాలో రానున్న రోజుల్లో వైరస్ తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. జో బైడెన్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టే నాటికి కరోనా కేసుల సంఖ్య 2కోట్లకు చేరుకుంటుందని అంచనా. అమెరికాలో ఇప్పటికే కోటి 22లక్షల మందిలో కరోనా సోకగా, వచ్చే జనవరి 20వ తేదీ నాటికి ఈ సంఖ్య 2కోట్లకు చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కరోనా కన్నా ముందుతో పోలిస్తే ప్రస్తుత భౌతిక దూరం నిబంధనలు 60శాతం పాటిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది..కొత్త అధ్యక్షుడు కరోనా నియంత్రణకోసం ముందుగానే ప్రణాళికలు రచిస్తున్నారు..వైద్య సిబ్బందితో ముఖాముఖి నిర్వహించారు.ఈ భేటీలో వైద్య సిబ్బంది వ్యాఖ్యలు విని కంటతడి పెట్టుకున్నారు నూతన అధ్యక్షుడు బైడెన్..
భారత దేశంలో కరోనా కేసులు ఇప్పటికీ రోజూ 50వేల వరకూ నమోదవుతున్నాయి..మొత్తం బాధితుల సంఖ్య కోటికి చేరువవుతున్నాయి..ఢిల్లీ వంటి నగరాల్లో సెండ్ వేవ్ కరోనా నగరం అస్తవ్యస్తం అవుతుంది..కరోనా వైరస్‌కు తోడు వాయుకాలుష్యంతో వైరస్ వ్యాప్తి మరి వేగంగా వ్యాప్తి చెందుతుంది..రంగంలోకి దిగిన కేంద్రం ముందస్తు చర్యలు తీసుకుంది..ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు..కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమీక్ష సమావేశంలో నిర్వహించారు.. ప్రధాని మోడీ ఇవాళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వివిధ కంపెనీల వ్యాక్సిన్ ట్రయల్స్ ముఖ్యమైన దశల్ని దాటి వినియోగానికి చేరువ అవుతుండటంతో అవి అందుబాటులోకి వచ్చాక..దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విధానం, వ్యూహంపై ముఖ్యమంత్రులతో చర్చించబోతున్నారు..
భారత్‌లో “ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా” వ్యాక్సిన్‌పై పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలో మూడో విడత క్లినికల్ ట్రయల్స్ పూర్తికాకముందే వ్యాక్సిన్‌ను వినియోగించేందుకు సీఐఐకి డీజీసీఐ అనుమతులు మంజూరు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ విధానం ఎలా ఉండాలనే దానిపై వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులతో చర్చించబోతున్నారు.