తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. అయితే అది వైరస్ ప్రభావం తగ్గినందువలన అనుకునేరు. టెస్టులు తక్కువగా చేస్తుండడంతో కేసులు కూడా బాగా తగ్గుతున్నాయని చెప్పాలి. గతంలో రోజుకు అరవై వేల పరీక్షల దాకా చేసే వారు. కానీ నలబై వేల పరీక్షలు మాత్రమే చేస్తుండడంతో వెయ్యి లోపే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 921 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,65,049 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో నలుగురు మరణించారు.
ఇప్పటి వరకు 1437 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 11,047గా ఉన్నాయి. వారిలో 8,720 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో 2,52,565 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1,097 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణలో రికవరీ రేటు 95..28% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 93.7% శాతంగా ఉంది. తెలంగాణలో మరణాలు 0.54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 42,740 పరీక్షలు చేస్తే ఇప్పటివరకు 52,01,214 పరీక్షలు చేశారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 146 కేసులు నమోదయ్యాయి.