తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారందరికీ కరోనా వ్యాక్సిన్లు..

-

దేశంలో కరోనా, ఓమిక్రాన్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ పై నజర్ పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ తీసుకోని వారిపై.. మొదటి డోసు తీసుకుని రెండో డోసులు తీసుకోని వారికి వ్యాక్సిన్లు ఇస్తున్నారు. మరోవైపు ఓమిక్రాన్ నేపథ్యంలో బూస్టర్ డోసుల వేయాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు గురించి పలువురు నిపుణుల హెచ్చరిస్తున్నారు.

ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థుల్లో 18 నిండిన వారికి కోవిడ్ వ్యాక్సిన్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో 18 ఏళ్లు నిండినవారు 55,250 మంది ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. వీరందరికి త్వరలో  వ్యాక్సిన్లు వేయనున్నారు. అలాగే ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పటికే పలు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను కరోనా భయంతో ఇళ్లకు పంపిస్తున్నారు. ఇదే  కొనసాగితే ఇంటర్ విద్యార్థుల చదువులపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version