హైదరాబాద్‌ లో మళ్ళీ కరోనా టెన్షన్‌.. బ్రిటన్‌ నుంచి వచ్చిన 15 మందికి !

-

హైదరాబాద్‌ లో మళ్ళీ కరోనా టెన్షన్‌ నెలకొంది. బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుల్లో చాలామందికి కరోనా పాజిటివ్‌ అని తేలుతోంది.  బ్రిటన్ నుంచి హైదరాబాద్‌‌కు ఇప్పటి వరకు 5 విమానాలు రాగా, అందులో వచ్చిన వారిలో 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారు కూర్చున్న సీట్లకు ముందు, వెనక మూడు వరుసల్లోని ప్రయాణికులను క్వారంటైన్‌ చేసేస్తున్నారు.

బ్రిటన్‌ లో విమానం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకున్నా ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిన ప్రయాణికులకు ఇక్కడ పాజిటివ్ అని తేలుతోంది. వారితో కలిసి ప్రయాణించిన మరో 300 మందిని క్వారంటైన్‌ లో ఉండాలని వైద్య శాఖ చెబుతోంది. ఇక ఇక్కడి కరోన కేసులు మాత్రం కాస్త తక్కువగానే నమోదు అవుతున్నాయి. ఇది కాస్త ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version