ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఇప్పుడు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా మహమ్మారి విస్తరిస్తూనే ఉంది గాని తగ్గడం లేదు. ఒక్క జిల్లాలో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కరోన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణాలో పెరుగుతాయి అని భావించిన కేసులు ఆంధ్రాలో పెరగడం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఇప్పుడు కేంద్రం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది.
తాజాగా అధికార వర్గాల్లో కరోనా కలకలం ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. ఏపీ రాజభవన్ లో మరో ఇద్దరికీ కరోనా వైరస్ సోకిందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రాజ్‌భవన్‌కు చెందిన నలుగురికి ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడ పనిచేసే ఒక ఉద్యోగితో పాటుగా 108 అంబులెన్స్ డ్రైవరుకు కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. మూడు రోజుల క్రితం నలుగురికి వచ్చింది.
గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఇద్దరు అటెండర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీనితో రాజభవన్ లో కరోనా సోకిన వారి సంఖ్య ఆరుకి చేరింది. గవర్నర్ కి కరోనా పరిక్షలు నిర్వహించారు. ఆయన వద్ద ఉన్న ఇతర సిబ్బందికి కూడా కరోనా పరిక్షలు చేయగా ఆయనకు నెగటివ్ వచ్చింది. దీనిపై ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎవరిని బయటకు రాకుండా చూడాలని సూచనలు చేసింది.