కరోనా కట్టడికి ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగ కారణంగా మొదటి డోస్ లో వేసిన టీకా కాకుండా రెండో డోసులో వేరే కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన ఉదంతాలు చూశాం. కొన్ని చోట్ల కేవలం మందును సిరింజీలోకి ఎక్కించకుండా వ్యాక్సినేషన్ ఇచ్చిన ఘటనలు కూడా చూశాం. ఇదిలా ఉంటే తాజాగా కరోనా వ్యాక్సిన్ బదులు ఒకరికి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరిలో జరిగింది. శనివారం ఈ ఘటన జరిగింది. బాధితుడు తన వ్యాక్సిన్ సర్టిఫికేట్ ను కోవిన్ పోర్టల్ లో అప్డేట్ చేయమని సిబ్బందిని కోరిన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నయాపూర్వా గ్రామానికి చెందిన శివమ్ జైశ్వాల్ కు కరోనా వ్యాక్సిన్ కు బదులు కుక్క కాటుకు వ్యాక్సినేషన్ గా ఉపయోగించే రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చారు సిబ్బంది. ఈ ఘటనపై ఛీప్ మెడికల్ ఆఫీసర్ దర్యాప్తుకు ఆదేశించారు. అయితే బాధితుడికి రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని… రేబిస్ వైరస్ కు ప్రికాశనరీ డోస్ గా ఉపయోగపడుతుందని తెలిపారు.