షాకింగ్ : స్పైస్‌జెట్‌ విమానం భారీ కుదుపు.. ప్రయాణికులకు గాయాలు..

-

ఎంతో ఆనందంగా.. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారి అనుకోని ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యే విధంగా సంఘటన చోటు చేసుకుంది. ఈ ఊహించని ఘటనతో అందరూ.. షాక్ తిన్నారు.. స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ బీ-373 ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఆపరేటింగ్‌ ఫ్లైట్‌ ఎస్‌జీ-945 ఆదివారం ముంబై నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరింది. అయితే.. ఏడున్నర గంటలకు అది అండల్‌లోని కాజి నజ్రుల్‌ ఇస్లాం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కావాల్సి ఉండగా గాల్లో ఉండగానే అది తీవ్రంగా కుదుపున లోనైంది. దీంతో లగేజీ మీద పడడంతో 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితిలో ఆందోళనకు గురయ్యారు ప్రయాణికులు.

ప్రమాదం జరిగినప్పటికీ ఫ్లైట్‌ దుర్గాపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ప్యాసింజర్‌లకు చికిత్స అందించారు. వీళ్లలో కొందరిని డిశ్చార్జి చేయగా.. మరికొందరు ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే ప్రయాణికుల ప్రాణాలకు ముప్పేమీ లేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. బలమైన గాలుల వల్లే కుదుపునకు విమానం లోనైనట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version