కరోనా మందు సంతానం మీద దెబ్బ కొడుతుందా…?

-

కరోనా వైరస్ ఏమో గాని ఇప్పుడు జనాలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. అసలు దేశంలో ఎవరికి కూడా ఇప్పుడు ప్రశాంతత లేకుండా పోయింది. ఇప్పుడు దానికి వాడే మందులు కూడా జనాలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏదోక రూపంలో దాని ప్రభావం దీర్ఘకాలికంగా పడే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు వైద్యులు ఒక విషయాన్ని గుర్తించారు.

చైనాలో కొందరు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో భాగంగా కరోనా వైరస్‌ చికిత్సలో భాగంగా రోగులకు అందిస్తున్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెండెసివిర్‌ మానవ వీర్య కణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని గుర్తించారు. అమెరికా ఎక్కువగా దీని మీద ఆశలు పెట్టుకుంది. కొన్ని రోజుల కిందట తాము ఎలుకలపై ప్రయోగాలు జరిపామని ఆ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడి అయిందని వారు చెప్పారు.

అమెరికా ఫార్మా కంపెనీ ఈ ఔషధాన్ని కరోనా రోగులపై పరీక్షించగా కరోనా ప్రభావం తగ్గింది అని గుర్తించారు. ఇండో-అమెరికన్ ఫిజీషియన్‌తో సహా పరిశోధకుల బృందం మూడో దశ ట్రయల్స్ నిర్వహించింది. అందులో కూడా మంచి ఫలితాలు వచ్చాయని గుర్తించారు. ఈ డ్రగ్ కరోనా మీద మంచి ప్రభావం చూపిస్తుంది అని వెల్లడి అయింది. అయితే ఇది వీర్యకణాల మీద ఎక్కువగా ప్రభావం చూపడం తో అమెరికాలో రోగులు భయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version