బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కి కరోనా వాక్సిన్

-

లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కి మరికొన్ని రోజుల్లో కరోనా వాక్సిన్ అందజేస్తున్నట్లు బకింగ్ హామ్ రాజభవనం వర్గాలు తెలిపాయి. ఫైజర్ అభివృద్ధి చేసిన కరోనా టీకా తీసుకోనున్నట్లు, వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే ఆ విషయాన్ని స్వయంగా బ్రిటన్ రాణియే వెల్లడిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాణితోపాటు భర్త ప్రిన్స్ ఫిలప్ (99) కూడా ఫైజర్ టీకాను తీసుకోనున్నట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఇద్దరూ త్వరలో టీకా తీసుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

elizabeth-2

ప్రపంచవ్యాప్తం శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిపై ఇప్పటికే పలు దేశాలు టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్ చివరిదశలో ఉండటంతో పూర్తి స్థాయిలో వాడుకలోకి రాలేవు. టీకా మెరుగైనా ఫలితాలు ఇస్తున్నాయని పలు కంపెనీలు ఉన్నాయి. అయితే కొన్ని వ్యాక్సిన్లపై ప్రజల్లో అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే టీకా తీసుకున్న విషయాన్ని బ్రిటన్ రాణి స్వయంగా వెల్లడించడం ద్వారా ప్రజల్లో వ్యాక్సిన్ పై ఉన్న అనుమానాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వైద్య వర్గాలు భావిస్తున్నారు.

వ్యాక్సిన్ భద్రతకు సంబంధించి ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగించేందుకు రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ చార్లెస్ వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది. అయితే, టీకా ఇచ్చేందుకు రాజకుటుంబానికి ప్రత్యేక ప్రాధ్యాన్యత ఏమీ లేదని, ప్రజలకు టీకా వయసువారీగా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, రాజకుటుంబానికి చెందిన వారికీ కూడా ఇదే నిబంధన వరిస్తుందని అధికారులు వెల్లడించారు.

ఫైజర్ వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రిన్స్ విలియమ్స్ ప్రత్యేక శద్ధను చూపారు. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని వ్యక్తిగతంగా సందర్శించి టీకాపై ఆరా తీశారు. 90శాతం వరకు టీకా మెరుగైన ఫలితాలు చూపుతోందని తెలుసుకుని పరిశోధకులను అభినందించారు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం బుధవారం ఫైజర్ టీకాకు అనుమతి ఇవ్వడంతో వ్యాక్సిన్ పంపిణీపై భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘ఆపరేషన్ కరేజియస్’ పేరిట మంగళవారం నుంచి టీకాను అందజేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version