కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని రైతుల డిమాండ్లకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసినందుకు దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని బీహార్ విపక్ష నేత తేజశ్వి యాదవ్ నితీష్ కుమార్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరోనావైరస్ మహమ్మారి ఉన్న సమయంలో అనుమతి లేకుండా నిరసన వ్యక్తం చేసినందుకు 18 మంది నాయకులపై కేసు నమోదైంది.
దీనిపై తేజస్వి స్పందించారు. “పిరికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం రైతుల గొంతు విమిపిస్తే మాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మీకు నిజమైన ధైర్యం, బలం ఉంటే మమ్మల్ని అరెస్టు చేయండి. లేకపోతే నాకు నేనుగా లొంగిపోతాను. నేను రైతుల కోసం ఉరి తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నా అని ఆయన సవాల్ చేసారు. కాగా ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.