2021 ప్రారంభంలో భారత్ లో రెండు మూడు మార్గాల నుంచి కరోనా వ్యాక్సిన్ లభించే అవకాశం ఉంది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. దేశంలో కరోనావైరస్ వ్యాక్సిన్ పంపిణీని ప్లాన్ చేయడానికి నిపుణుల బృందాలు వ్యూహాలను రూపొందిస్తున్నాయని హర్ష్ వర్ధన్ మంగళవారం మీడియా సమావేశంలో చెప్పారు. కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు.
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ లభ్యత మరియు దేశంలో దాని పంపిణీపై హర్ష్ వర్ధన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2020 డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనావైరస్ వ్యాక్సిన్ వస్తుందని ప్రకటించింది. మన దేశంతో పాటుగా దాదాపు 20 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు.