వ్యాక్సిన్ పై పోర్టల్.. ఇకపై వివరాలన్నీ అందులోనే.

-

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదికి పైగా కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రయత్నాలు జరుపుతున్నాయి. రష్యాలో అయితే వ్యాక్సిన్ తయారైందని, ఇతర దేశాలతో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. మనదేశంలోనూ వ్యాక్సిన్ ఉత్పత్తుల్లో
ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ పై అప్డేట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పోర్టల్ డిజైన్ చేయనున్నారట.

వ్యాక్సిన్ తయారీ ఎక్కడి వరకు వచ్చింది. క్లినికల్ ట్రయల్స్ ఏ దశలో ఉన్నాయి తదితర అంశాలు అన్నీ ఇందులో పొందుపర్చనున్నారట. దానివల్ల వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియలో ఏ కంపెనీ ఎక్కడి దాకా వచ్చింది. బయట వస్తున్న సమాచారం నిజామా కాదా అన్న సందేహాలు తీరిపోయాయి.అంతే కాదు ఎలాంటి అనవసర సమాచారం బయటకి రాకుండా కేవలం ఖచ్చితమైన సమాచారం మాత్రమే వస్తుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ఈ పోర్టల్ ఈరోజు లాంచ్ చేసారు. దీన్లోకి వెళ్ళి వ్యాక్సిన్ ఏ రోజువ లాంచ్ అవుతుంది, ప్రస్తుతం ఏ దశలో ఉంది తదితర విషయాలన్నీ తెలుసుకోవచ్చని తెలిపాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెబ్ సైట్ లోకి వెళితే వ్యాక్సిన్ కి సంబంధించిన పోర్టల్ ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news