ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 14 వరకు అనగా 21 రోజులు ఎవరో కూడా దేశ ప్రజలు ఇల్లు దాటి బయటకు రాకూడదు అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలకు నాయకులు ముఖ్యమంత్రులు ప్రజలను ఇంటి నుండి బయటకు రాకుండా ఎక్కడికక్కడ పోలీసులను రంగంలోకి దించి కేవలం నిత్యావసర సరుకులకు మాత్రమే బయటికి వదులుతున్నారు. అది కూడా కుటుంబానికి ఒకరిని. ఇటువంటి దారుణమైన ప్రమాదకరమైన ఈ వైరస్ ప్రబల కుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం ప్రకటించడం జరిగింది.
తాజాగా ఈ మత ప్రబోధకుడు కరోనా వైరస్ కి వచ్చి చనిపోవడం జరిగింది. దీంతో అతను పర్యటించిన గ్రామాలు మొత్తం రెడ్ జోన్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరు ఆ గ్రామం నుండి బయటకు రాకూడదు..అదేవిధంగా ఆ గ్రామంలో కి బయట వాళ్ళు ఎలా కూడదు. దాదాపు లక్ష మందికి పైగానే ఈ మత ప్రబోధకుడు వల్ల ప్రమాదంలో పడినట్లు…వైరస్ ఎవరికీ ఉందో ఎవరికీ లేదు అర్థంకాని పరిస్థితిలో ఆ గ్రామాలు ఉన్నట్టు సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త విన్న చాలా మంది నెటిజన్లు దేశం లో ఉన్న కరోనా కేసులు అన్నీ ఒకెత్తు .. వీడొక్కడూ ఒకెత్తు అంటూ ఆ మత ప్రబోధకుడని బండ బూతులు తిడుతున్నారు.