సంచలనం; కరోనా ఇలానే పుట్టింది…!

-

కరోనా వైరస్ అసలు ఏ విధంగా పుట్టింది…? దీని మీద ఎన్నో పరిశోధనలు చేసారు. కాని అది ఏ విధంగా పుట్టిందో ఎవరికి స్పష్టంగా అర్ధం కావడం లేదు. అసలు వైరస్ సోకడానికి జంతువు కారణమా లేక మరేదైనా కారణమా అనేది కూడా చెప్పలేని పరిస్థితి. గబ్బిలాల నుంచి వచ్చింది అని ఒకడు, పాముల నుంచి వచ్చిందని మరొకడు, లేదు ల్యాబ్ లో లీక్ అయిందని మరొకడు… ఇలా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమే.

అంతే గాని వైరస్ ఎక్కడ పుట్టిందో మాత్రం చెప్పే ఒక్క ఆధారం కూడా బయటకు రావడం లేదు. ఇప్పుడు కరోనా వైరస్ ఏ విధంగా పుట్టింది అనే దాని మీద పరిశోధనలో కీలక అడుగు వేసారు. 2019 డిసెంబర్‌లో మొదటిసారి 41 మందికి ఈ వైరస్ సోకగా వారిలో 27 మంది వ్యూహాన్ లోని హుబే ప్రావిన్స్ లోని ఒక మార్కెట్ కి వెళ్లి చేపలు వంటి వాటిని కొనుక్కున్నారు. వాటిని తినగా కరోనా వచ్చింది అనుకున్నారు.

అయితే వైరస్‌ జీన్ (జన్యువులపై పరిశోధన)పై మాలిక్యూలర్ జీనోమిక్ పరిశోధన చేయగా కీలక విషయం బయటకు వచ్చింది. 2019 నవంబర్‌లో పుట్టినట్లు గుర్తించారు. ఇది 2002 లో వచ్చిన సార్స్ వైరస్ కి దగ్గరగా ఉందనే విషయం గుర్తించారు. ఇది చైనాలోని గ్వాంగ్‌ డాంగ్ ప్రావిన్స్‌లో పుట్టి ఆ తర్వాత ఏడాదికి 29 దేశాల్లో విస్తరించింది. మొత్తం 8098 కేసులు నమోదు అయ్యాయి. అప్పుడు 774 మంది చనిపోయారు.

ఇది కూడా అక్కడే పుట్టింది. గబ్బిలాల నుంచి ,మనుషులకు సోకింది. సార్స్-కరోనా వైరస్-1, సార్స్-కరోనా వైరస్-2 అనే రెండు రకాల వైరస్‌లు కలిసి ఈ వైరస్ పుట్టింది అంటున్నారు. సార్స్-కరోనా వైరస్-1 అనేది గబ్బిలాలపై పుట్టగా… సార్స్ కరోనా-వైరస్-2 అనేది మలేసియాలోని ప్యాంగోలిన్ల అంటే చీమలు తినే వాటి నుంచి వచ్చింది. కేవలం గబ్బిలాలు గానీ, లేదా కేవలం ప్యాంగోలిన్లు గానీ కరోనా రావడానికి పూర్తి కారణం కాదని… ఆ రెండింటి మీద ఉండే వైరస్ లు కలవడంతోనే పుట్టింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version