ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ ని వాడుకోవటంలో సోషల్ మీడియా ని అద్భుతంగా ప్లాట్ ఫాం చేసుకుని మన వాళ్ళు చాలా ముందు ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి ఉండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో చాలామంది భార్యలకు భర్తలు వంటింట్లో సాయం చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే పిల్ల చేష్టలు చేస్తూ అల్లరి చేష్టలు చేస్తూ పిల్లలతో ఆడుకుంటూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
ఇదే తరుణంలో ఆన్లైన్ లో పేకాట ని ప్రోత్సహించే వెబ్సైట్లు కూడా క్రియేటివ్ ప్రకటనలతో పేకాటరాయుళ్ల ను ఆకట్టుకుంటున్నాయి. బయటకెళ్ళి ఆడితే ఆట ఆడే టప్పుడు ఎవడైనా తుమ్మినా, చేతులు మీద చేతులు మీద వేసినా, కరోనా భయం మీకు వెంటాడుతుంది కాబట్టి ఎందుకు వచ్చిన సొంత ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ లో సుబ్బరంగా పేకాట ఆడుకుంటే ఇంట్లోనే సక్కగా లక్షాధికారి, కోటీశ్వరుడు అయిపోతారు అంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నాయి. మొత్తం మీద కరోనా వైరస్ ఎఫెక్ట్ తో వాడకంలో ఏదీ లేదు అని అనర్హం అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటనల పరిస్థితి ఉంది.