తెలంగాణాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. కట్టడిలో ఉందనుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రం మీద పగబట్టినట్టు కనపడుతుంది. తెలంగాణా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు ఏ విధంగాను కనపడటం లేదు. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కొత్తగా 62 కరోనా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 334 కి చేరుకుంది. నాలుగు రోజుల్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీ మర్కాజ్ యాత్రకు వెళ్లి వచ్చిన వారి నుంచి ఈ కేసులు నమోదు కావడం ఇప్పుడు భయపెడుతుంది. వాళ్ళ నుంచి ఎవరికి సోకింది…? వాళ్ళు ఎక్కడ ఎక్కడ తిరిగారు అనేది అర్ధం కావడం లేదు. కేసులు రోజు రోజుకి పెరగడంపై ఇప్పుడు కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు.
రాష్ట్రంలో కఠినం గా లాక్ డౌన్ అమలు చెయ్యాలని చూస్తున్నారు. కేంద్రం లాక్ డౌన్ ని ఎత్తేసినా సరే కేసీఆర్ మాత్రం దీన్ని కొనసాగించడమే మంచిది అనే భావనలో ఉన్నారు. కరోనా కేసులు పెరిగితే రాష్ట్రంలో వైద్య సిబ్బంది కొరత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులు ఇంకా పెరిగితే ఆస్పత్రుల కొరత కూడా భారీగా ఉండే సూచనలు ఉన్నాయి. దీనితో ఇప్పుడు కేసీఆర్… కరోనా పరిక్షలను వేగంగా పూర్తి చేసి జ్వరం ఉన్న వాళ్ళను ఆస్పత్రులకు తరలించాలని చూస్తున్నారు.