ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా. ప్రస్తుతం కరోనా వైరస్ యూరప్ దేశాలలో మరణ తాండవం చేస్తుంది. ఇటలీ మరియు స్పెయిన్ అదేవిధంగా అమెరికా దేశాలలో విజృంభిస్తోంది. ఇప్పటికే ఆయా దేశాలు జాగ్రత్తలు తీసుకుంటున్నా గాని చాలావరకు వైరస్ అరికట్టడంలో కొంత నిర్లక్ష్యం ఆయా ప్రభుత్వాలు వ్యవహరించడంతో చేయి దాటి పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయి దేశంగా ఇటలీ ముందుండగా ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశంగా అమెరికా ముందు ఉంది. అయితే పక్కనే ఉన్న చైనా దేశం లో పుట్టిన ఈ వైరస్ భారతదేశంలో అంతగా ప్రభావితం చెయ్యలేక పోవటం పట్ల వైద్యుడు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి అనేక విషయాలు చెప్పుకొచ్చారు.
అయితే ఇరాన్ దేశంలో ఎక్కువగా ఏసీలు ఉపయోగించడంతో…ఆ దేశంలో ప్రభావం ఎక్కువ చూపించిందని చెప్పుకొచ్చారు. అయితే ఇండియాలో మాత్రం ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రత పాయింట్ లో స్లోగా బలహీన పడి తట్టుకోలేక ప్రభావం చూపించలేక పోతుంది అని నాగేశ్వరర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మొత్తం మీద మన దేశంలో ఉన్న ఉష్ణోగ్రత వైరస్ నీ ఎదగకుండా చేయటం గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.