లాంబ్డా.. కరోనా కొత్త రూపం..డెల్టా కంటే ప్రమాదం అంటున్న మలేషియా ఆరోగ్య శాఖ

-

కరోనా కొత్త రూపాలు కలవరపెడుతున్నాయి. వేగంగా విస్తరించే డెల్టా వేరియంట్ విషయంలో ఎంత ఆందోళన చెందుతున్నారో తెలిసిందే. డెల్టా ప్లస్ మూడవ వేవ్ కి కారణం అవుతుందేమో అన్న భయాలు అందరిలోనూ ఉన్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మరో కొత్త రూపాంతరం బయటకి వచ్చింది. లాంబ్డా పేరుతో పిలుస్తున్న ఈ కరోనా రూపాంతరం, డెల్టా కంటే ప్రమాదకరమైనదని మలేషియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదీగాక ఇప్పటికే 30దేశాల్లో లాంబ్డా రూపాంతరం విస్తరించిందని కనుక్కున్నారు.

కరోనా మరణాల శాతం ఎక్కువగా ఉన్న పెరూ దేశంలో లాంబ్డా వేరియంట్ ని కనుక్కున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ లోనూ లాంబ్డా వేరియంట్ ఆనవాళ్ళు ఉన్నాయని ఆస్ట్రేలియన్ న్యూస్ పోర్టల్ ప్రచురించింది. మే, జూన్ నెలల్లో పెరూ దేశంలో 82శాతం శాంపిల్స్ కలెక్ట్ చేసారు. ఇంకా దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కూడా 32శాతం శాంపిల్స్ కలెక్ట్ చేసారు. మరి ఈ లాంబ్డా వేరియంట్ వ్యాక్సిన్లకి లొంగుతుందా లేదా అన్నది ఇంకా వెల్లడి చేయలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version