అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన కేసులో నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్‌పై ఏసీబీ దూకుడు పెంచింది. నిఖేశ్‌ను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది.ఈ మేరకు ఏసీబీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వచ్చే సోమవారం విచారించనున్నది.ఈ కేసులో ఇప్పటికే నిఖేశ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైనా ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.
కాగా, నిఖేశ్,ఆయన బంధువుల ఇళ్లపై సోదాలు చేపట్టిన ఏసీబీ ఆదాయనికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేసింది. అనంతరం నిఖేశ్ కుమార్‌ను అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్డు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.దాంతో ఏసీబీ అధికారులు ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే, నిఖేశ్‌ను లోతుగా విచారిస్తే మరికొంత మంది కీలక అధికారుల అవినీతి బాగోతం బయటకు వస్తుందని ఏసీబీ భావించి కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది.