పీచు మిఠాయి విక్రయాలను నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం..!

-

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల రద్దీగా ఉండే ప్రాంతాల్లో అత్యధికంగా అమ్మే పీచు మిఠాయి విక్రయాలను నిషేధించాలని ప్రభుత్వం ఉత్తర్వులని జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు వాడుతున్నారని తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకి వ్యతిరేకంగా విక్రయాలు జరిపితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆక్ట్ 2016 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నీ తమిళనాడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎం సుబ్రహ్మణ్యన్ ఆదేశించారు.

పీచు మిఠాయి లో కృత్రిమ రంగు కోసం కెమికల్ జోడించబడుతుంది దీంతో పలు రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయని విషపూరితమైన పదార్థాలని కలిపినందున పుదుచ్చేరి ప్రభుత్వం గతవారం పీచు మిఠాయివిక్రయాలని నిషేధించిన సంగతి మనకి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news