ప్రముఖ సినీనటి జయప్రద గురించి ప్రత్యకించి పరిచయం చేయక్కర్లేదు. జయప్రద చాలా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు 2019 ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంగించిన కేసులో జయప్రద ఉన్నారు ఆమెని విచారానికి రావాలని పలుమార్లు కోర్టు ఆదేశించినప్పటికీ ఆమె కోర్టుకి హాజరు కాకపోవడంతో ఆమెపై నాన్బెయిలబుల్ వారంటీ జారీ చేశారు. జనవరి 10 నా కోర్టులో హాజరు పరచాలని పోలీసులు ని న్యాయస్థానం ఆదేశించింది. అయినా కూడా ఆమె ఆచూకీ లభించలేదు దీంతో ప్రత్యేక కోర్ట్ ఆమెని పరారీలో ఉన్నట్లు ప్రకటించింది.
ఎన్నికల ప్రవర్తన నియమాల్ని ఉల్లంగించినందుకు సంబంధించి ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినప్పటికీ జయప్రద కోర్టు ముందు హాజరు కాకపోవడంతో ఆమె మీద ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోరుతూ కఠిన చర్యలు తీసుకుంది. మార్చి 6న హాజరయ్యేలా డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలని సిద్ధం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు సెక్షన్ 82 crpc కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.