హత్రాస్ ఘటనపై అలహాబాద్ హై కోర్టులో ఈరోజు విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు హాథ్రస్ జిల్లా అధికారులతో పాటు.. బాధితురాలి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధిత యువతి కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్‌ను ధర్మాసనం రిక్డార్ చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల్ని కట్టుదిట్టమైన భద్రత మధ్య హైకోర్టు బెంచ్ ఎదుట హాజరుపర్చారు పోలీసులు.
ఘటనపై ఉత్తరప్రదేశ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీతో పాటు అడిషనల్ డీజీపీలకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. జిల్లా మేజిస్ట్రేట్‌తో పాటు ఎస్పీకి కూడా సమన్లు జారీ చేసింది కోర్టు. హాత్రాస్ లో 20 ఏళ్ల యువతి మీద యువతి పై అగ్రకులాలకు చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి తీవ్రంగా గాయపర్చారనే ఆరోపణల మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.