జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్

-

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటి సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పాస్ పోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చి తన భార్య, పిల్లల పేర్లతో ముగ్గురిని అమెరికాకు అక్రమ రవాణా చేసిన కేసులో సోమవారం రాత్రి ఆయన్ని పటాన్ చెరులో  అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సికింద్రాబాద్ సిటి సివిల్ కోర్టులో హాజరుపరిచారు. కేసులో పేర్కొన్న అంశాలను పరిశీలించిన కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జగ్గారెడ్డిని చంచల్ గూడ్ జైలుకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version