చిన్నారులకు ఇక కోవాగ్జిన్… అమెరికాలోనూ దరఖాస్తు

-

దేశీయంగా తయారు చేసిని కోవాగ్జిన్ టీకాను ఇండియాలో విస్త్రుతంగా వినియోగిస్తున్నారు. భారత్ లో ప్రధానంగా కోవీషిల్డ్ , కోవాగ్జిన్ టీకాలనే ప్రజలకు ఇస్తున్నారు. తాాజాగా WHO సాంకేతిక సలహా గ్రూపు కోవాగ్జిన్ అత్యవస వినియోగానికి అనుమతి ఇచ్చింది. దీంతో ప్రపంచ దేశాల్లో కోవాగ్జిన్ వినియోగించేందకు మార్గం సుగమమైంది. మరో వైపు  కోవాగ్జిన్ ను చిన్నారులకు ఇచ్చేందుకు ఇండియాలో సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా… డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీజీసీఐ) నుంచి అనుమతి లభించలేదు. ఒక వేళ అనుమతులు వస్తే ఇండియాలో 2-18 ఏళ్ల లోపు పిల్లలకు కోవాగ్జిన్ ఇవ్వవచ్చు.

తాజాగా కోవాగ్జిన్ అనుమతుల కోసం ఓక్యూజెన్ అనే కంపెనీ అమెరికాలో దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ పిల్లలకు కోవాగ్జిన్ ఇచ్చేందకు అత్యవసర అనుమతిని కోరింది. ప్రస్తుతం భారత్‌ బయోటెక్‌ చిన్నారులపై చేసిన పరీక్షలకు సంబంధించిన డేటాను యూఎస్‌ ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ)కు పంపిందట. అయితే, ఈ పరీక్షలేవీ అమెరికాలో ఇప్పటి వరకు జరగలేదు.. దీంతో.. అనుమతిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాల్లో కోవాగ్జిన్ ను వాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version