IFFI లో ప్ర‌ద‌ర్శ‌న కు తెలుగు చిత్రం

-

ఈ ఏడాది కి సంబంధించి 52 వ‌ అంత‌ర్జాతీయ చ‌ల‌నచిత్రోత్స‌వాలు జ‌రుపు కోవ‌డానికి స‌ర్వం సిద్ధం అవుతున్నాయి, న‌వంబ‌ర్ 20 నుంచి దాదాపు తొమ్మిది రోజుల పాటు అంటే.. న‌వంబ‌ర్ 28 వ‌ర‌కు ఈ ఉత్స‌వాలు జ‌రుగుతాయి. ఈ వేడుక‌ల‌ను గోవ వేదిక‌న జ‌ర‌ప‌నున్నారు. అయితే ఈ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో ప్ర‌ద‌ర్శించ డానికి ఒక తెలుగు సినిమా ఎంపిక అయింది. రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం లో వచ్చిన నాట్యం అనే సినిమా ఈ ఇఫీ లో ప్ర‌ద‌ర్శన కు ఎంపిక అయింది.

ఈ సినిమా ఈ ఏడాది అక్టొబ‌ర్ 22 న విడుద‌ల అయింది. ఈ సినిమా లో కూచిపూడి నాట్యం గురించి ఉంటుంది. అయితే ఈ సినిమా ను త్వ‌ర‌లో నే అంత‌ర్జాతీయ చ‌ల‌న చ‌త్రోత్స‌వాలలో ప్ర‌ద‌ర్శించ నున్నారు. దీని లో ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డానికి అన్ని దేశాల నుంచి ఫీచ‌ర్ విభాగం లో మొత్తం 221 సినిమా లు ఎంట్రీ ఇవ్వ‌గా అందు లో నుంచి 25 సినిమా ల‌ను మాత్ర‌మే ఎంపిక చేశారు. అలాగే నాన్ ఫీచ‌ర్ విభాగంలో 203 సినిమాలు ఎంట్రీ ఇవ్వ‌గా అందులో నుంచి 20 సినిమాల‌ను ఎంపిక చేశారు. ఇందులో మ‌న దేశం నుంచి ఆస్కార్ కు నామినేట్ అయిన కూళంగళ్ తో పాటు దేశ వ్యాప్తంగా ప‌లు ప్రాంతీయ భాష చిత్రాలు కూడా ఎంపిక అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version