దేశీయ ఫార్మా దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్‌ను గాను మరో చోట క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఒడిశాలోని ఎస్‌యూఎం హాస్పిటల్‌లో వ్యాక్సిన్‌కు ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) దేశవ్యాప్తంగా మొత్తం 12 చోట్ల కోవ్యాక్సిన్ ట్రయల్స్ చేపట్టిన విషయం విదితమే. అందులో భాగంగానే ఒక్కో కేంద్రంలో నెమ్మదిగా ట్రయల్స్ ప్రారంభమవుతున్నాయి.
కాగా కోవ్యాక్సిన్‌కు గాను జూలై 17న ప్రారంభించిన ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు ఇప్పటి వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురు కాలేదని సైంటిస్టులు తెలిపారు. అయితే ఫేజ్ 1 ట్రయల్స్ పూర్తయ్యేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దాని తరువాత ఫేజ్ 2 ట్రయల్స్ ఉంటాయి. ఆ తరువాత ఫేజ్ 3 ట్రయల్స్‌తోపాటు వ్యాక్సిన్ ఉత్పత్తిని ఒకేసారి ప్రారంభిస్తారని తెలుస్తోంది. వ్యాక్సిన్ పంపిణీ అయ్యేనాటికి ఫేజ్ 3 ట్రయల్స్ ఫలితాలు వస్తాయి. అవి ఆశాజనకంగా ఉంటే అప్పటికే తయారు చేసిన డోసులను ప్రజలకు పంపిణీ చేస్తారు. ఇందుకు కనీసం మరో 2 నెలల సమయం అయినా పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక దేశంలోని ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో ట్రయల్స్‌ను చేపడుతున్నప్పటికీ అవి అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. దీంతో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.