ప్రపంచాన్ని కరోనా కొత్త స్ట్రెయిన్ వణికిస్తున్న సమయంలో ఆస్ట్రేలియా సైంటిస్టులు గుడ్‌న్యూస్ చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెండో సారి వైరస్ బారిన పడకుండా 8 నెలలు యాంటీ బాడీలు కాపాడుతాయని తమ పరిశోధనలో తేలిందని పేర్కోన్నారు. మెమొరీ కణాలు దీర్ఘకాలం పాటు శరీరాన్ని అప్రమత్తం చేస్తాయని వారు పేర్కొన్నారు.
వైరస్ నుంచి కోలుకున్న వారిలో రోగ నిరోధకతపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్త లు అధ్యయనం చేశారు. రోగనిరోధక వ్యవస్థలో ఉండే మెమొరీ బీ సెల్స్, వైరస్ వల్ల కలిగిన ఇన్ఫెక్షన్ ను దీర్ఘకాలం గుర్తు పెట్టుకుంటాయని ఈ పరిశోధనలో తేలింది. ఇక ఒక వేళ కరోనా సోకి తగ్గిన వ్యక్తిపై మరో సారి వైరస్ దాడి చేసినప్పుడు వెంటనే గుర్తించి, వాటిని ఎదుర్కొనేందుకు యాంటీబాడీలను వేగంగా ఉత్పత్తి చేస్తూ రక్షణ కల్పిస్తాయని సైంటిస్టులు గుర్తించారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు.