బ్రేకింగ్ : తూర్పుగోదావరిలో కొత్త స్ట్రెయిన్ అనుమానిత కేసు !

-

ఒకపక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రక్రియ జోరుగా జరుగుతోంది. అయినా సరే కరోనా టెన్షన్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే రకరకాల స్ట్రెయిన్ లు వెలుగులోకి వస్తూ ఉండడంతో ఇబ్బంది కరంగా మారింది. తాజాగా  తూర్పుగోదావరి జిల్లాలోని తుని మండలంలోని తేటగుంట గ్రామంలో కొవిడ్‌ స్ట్రెయిన్‌ అనుమానిత కేసు నమోదు అయినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత శుక్రవారం ఆస్ట్రేలియా నుంచి ఢిల్లీకి, అక్కడ్నుంచి విశాఖపట్నానికి విమానాల్లో వచ్చారు.

విశాఖ నుంచి క్యాబ్‌ లో తేటగుంట వచ్చారు. అయితే డిల్లీ, విశాఖలో ఆ వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చింది, గ్రామానికి చేరిన మరుసటి రోజు కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ రావడంతో కొత్త స్ట్రెయిన్‌ అనే అనుమానంతో నమూనాలను కాకినాడ జీజీహెచ్‌కు పంపారు. విదేశాల నుంచి వచ్చిన ఈ వ్యక్తిని దాదాపు 20 మంది కలిశారు. దీంతో వారికి కూడా పరీక్షలు నిర్వహించగా ఆ ఫలితాలు మరో రెండు రోజుల్లో తెలియనున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version