కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (17-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. దేశంలో కొత్తగా 57,982 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 26,47,664కు చేరుకుంది. 19,19,843 మంది కోలుకున్నారు. మొత్తం 50,921 మంది చనిపోయారు. 6,76,900 మంది చికిత్స పొందుతున్నారు.
2. తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 92,255కు చేరుకుంది. 70,132 మంది కోలుకున్నారు. 21,420 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం 703 మంది చనిపోయారు.
3. దేశంలో కరోనా రికవరీ రేటు పెరిగింది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం 72గా ఉంది. ఒక్క రోజులోనే 57,584 మంది కోలుకున్నారు. ఇప్పటికే దేశంలో 3 కోట్ల కరోనా టెస్టులు చేశారు. ఆదివారం ఒక్క రోజే 7,31,697 పరీక్షలు చేశారు.
4. జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. పరీక్షలను ఇంకా వాయిదా వేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అందువల్ల పరీక్షలను వాయిదా వేయలేమని చెబుతూ పిటిషన్‌ను కొట్టివేశారు.
5. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు సీపీ అంజనీకుమార్ వినాయక చవితి సందర్భంగా సూచనలు చేశారు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో గణేష్ విగ్రహాలను పెట్టేందుకు అనుమతి లేదన్నారు. ప్రజలు ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలి అన్నారు.
6. కరోనా వైరస్ జన్యుపరంగా మార్పులకు లోనవుతుందని మలేషియాకు చెందిన సైంటిస్టులు గుర్తించారు. ఫిలిప్పీన్స్, ఇండియాల నుంచి వచ్చిన పలువురు ప్రయాణికులకు కరోనా సోకిందని, వారిలో ఉన్న కరోనా వైరస్ ఇంతకు ముందు వైరస్‌తో పోలిస్తే మార్పులకు లోనైందని తెలిపారు.
7. ఏపీలో కొత్తగా 6780 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,96,609కి చేరుకుంది. 84,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,09,100 మంది కోలుకున్నారు. 2,732 మంది చనిపోయారు.
8. తెలంగాణ రాష్ట్రానికి ఫ్లిప్‌కార్ట్ 50వేల పీపీఈ కిట్లను అందజేసింది. మంత్రి కేటీఆర్‌కు ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారిని కేటీఆర్ అభినందించారు.
9. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 7వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో సీటుకు, సీటుకు మధ్య దూరంతో సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 20 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి.
10. కరోనా నేపథ్యంలో బీహార్ లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 6వ తేదీ వరకు పొడిగించింది. అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ లాక్‌డౌన్ ఉంటుంది. బీహార్‌లో 1.04 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 461 మంది చనిపోయారు.