కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (19-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో బుధ‌వారం (19-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. ఏపీలో కొత్త‌గా 9,742 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,13,108కి చేరింది. 2,906 మంది చ‌నిపోయారు. 2,23,477 మంది కోలుకున్నారు. 86,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

2. క‌రోనా వైర‌స్ మురుగు నీటి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంద‌ని సైంటిస్టులు తెలిపారు. హైద‌రాబాద్‌లో ప‌లు ప్రాంతాల్లో సేక‌రించిన మురుగునీటిని సైంటిస్టులు ప‌రిశీలించారు. ఆ నీటిలో క‌రోనా వైర‌స్ ఉంద‌ని, అందువ‌ల్ల అది ఇత‌రుల‌కు వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు.

3. భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. ఈ మేర‌కు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫ‌ర‌ల్ హాస్పిట‌ల్ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గ‌త కొద్ది రోజులుగా ప్ర‌ణ‌బ్ క‌రోనాతో ఆ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.

4. భార‌త ప్ర‌జ‌ల‌కు ముందుగా ఆక్స్‌ఫ‌ర్డ్ కోవిడ్ వ్యాక్సినే అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే ఆ వ్యాక్సిన్‌కు ఇప్ప‌టికే ఫేజ్ 1 ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యాయి. క‌నుక భార‌త్‌లో నేరుగా ఫేజ్ 2, 3 ట్ర‌య‌ల్స్ చేప‌డుతున్నారు. ఆ ట్ర‌య‌ల్స్ చాలా త్వ‌ర‌గా పూర్త‌వుతాయి క‌నుక‌.. ముందుగా ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సినే మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

5. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో హెర్డ్ ఇమ్యూనిటీపై దేశాలు ఆశ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని, క‌చ్చితంగా వ్యాక్సిన్ రావాల్సిందేన‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు ఆ సంస్థ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అభిప్రాయ‌ప‌డ్డారు.

6. భార‌త్‌లో కొత్త‌గా 64,531 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 27,67,274కు చేరుకుంది. 52,889 మంది చ‌నిపోయారు. 6,76,514 మంది చికిత్స పొందుతున్నారు. 20,37,871 మంది కోలుకున్నారు.

7. తెలంగాణ‌లో కొత్త‌గా 1763 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 95,700కు చేరుకుంది. 719 మంది చ‌నిపోయారు. 73,991 మంది కోలుకున్నారు. 20,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

8. కేర‌ళ‌లో క‌రోనా కేసుల సంఖ్య 50వేలు దాటింది. కొత్త‌గా 2,333 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 50,231కి చేరుకుంది. 17,382 మంది చికిత్స పొందుతున్నారు. 32,611 మంది కోలుకున్నారు.

9. మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. అక్క‌డ కొత్త‌గా 13,165 కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,28,642కు చేరుకుంది. 21,033 మంది చ‌నిపోయారు. 4,46,881 మంది కోలుకున్నారు. 1,60,413 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

10. క‌రోనా ప‌రీక్ష‌ల‌ను చేయ‌డంలో ఏపీ దేశంలోని ఇత‌ర రాష్ట్రాల క‌న్నా ముందంజ‌లో ఉంది. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం జ‌నాభాలో 5.65 శాతం మందికి క‌రోనా టెస్టులు చేశారు. 30,19,296 టెస్టులు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version