కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో శనివారం (19-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..
1. కరోనా రికవరీల విషయంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న అమెరికాను భారత్ వెనక్కి నెట్టింది. అమెరికాలో 41 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా భారత్‌లో 42 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.
2. ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,17,776కు చేరుకుంది. 5,302 మంది చనిపోయారు. 81,763 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5,30,711 మంది కోలుకున్నారు.
3. దేశంలో కొత్తగా 93,337 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 53,08,015కు చేరుకుంది. 10,13,964 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 42,08,432 మంది కోలుకున్నారు. 85,619 మంది చనిపోయారు.
4. తెలంగాణలో కొత్తగా 2,123 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,69,169కి చేరుకుంది. 1025 మంది చనిపోయారు. 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,37,508 మంది కోలుకున్నారు.
5. కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 7 రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం నిర్వహించనున్నారు.
6. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు గాను వచ్చే వారం నుంచి దేశంలో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. పూణెలోని సాసూన్ జనరల్ హాస్పిటల్‌లో ట్రయల్స్ చేపట్టనున్నారు.
7. ఢిల్లీలో కరోనా సమూహ వ్యాప్తి మొదలై ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు. ఐసీఎంఆర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందన్నారు.
8. కోవిడ్ వారియర్లపై దాడులు చేసే వారికి, ఆస్తులు ధ్వంసం చేసే వారికి ఇకపై 5 ఏళ్ల జైలుశిక్ష విధించనున్నారు. ఈ మేరకు కేంద్రం రూపొందించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
9. కోవిడ్ నేపథ్యంలో గత మార్చి నెల నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగడం లేదు. అయితే త్వరలో సిటీ బస్సులను మళ్లీ రోడ్లపైకి తెచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
10. కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని అన్నారు.