కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (23-08-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో ఆదివారం (23-08-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

1. దేశంలో కొత్త‌గా 69,239 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 30,44,941కి చేరుకుంది. 7,07,668 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 22,80,567 మంది కోలుకున్నారు. 56,706 మంది చ‌నిపోయారు.

2. తెలంగాణ‌లో కొత్త‌గా 2,384 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,04,249కి చేరుకుంది. 22,908 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 80,586 మంది కోలుకున్నారు. 755 మంది చ‌నిపోయారు.

3. ఏపీలో కొత్త‌గా 7,895 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,53,111కి చేరుకుంది. 89,742 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,60,087 మంది కోలుకున్నారు. 3,282 మంది చ‌నిపోయారు.

4. దేశంలో మ‌రో 73 రోజుల్లోగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంద‌న్న వార్త‌ల‌పై సీర‌మ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా స్ప‌ష్ట‌త నిచ్చింది. ఆ వార్త‌లో నిజం లేద‌ని, తాము అలా అన‌లేద‌ని తెలిపింది. ట్ర‌య‌ల్స్ పూర్తిగా విజ‌య‌వంతం అయితేనే వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెడతామ‌ని తెలిపింది.

5. సినిమా, టీవీ సీరియ‌ల్స్ షూటింగ్ చేసుకునేందుకు కేంద్రం అనుమ‌తులు ఇచ్చింది. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ షూటింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో త‌ప్ప‌కుండా సోష‌ల్ డిస్ట‌న్స్ పాటించాలి.

6. శ‌నివారం వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 3.52 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేశామ‌ని ఐసీఎంఆర్ తెలిపింది. శ‌నివారం ఒక్క రోజే 8,01,147 శాంపిల్స్‌ను ప‌రీక్షించిన‌ట్లు తెలిపారు. మొత్తం 3,52,92,220 శాంపిల్స్ ను టెస్టు చేశారు.

7. త‌మిళ‌నాడులో కొత్త‌గా 5,975 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,79,385కి చేరుకుంది. 3,19,327 మంది కోలుకున్నారు. 53,541యాక్టివ్ కేసులు ఉన్నాయి. 6,517 మంది చ‌నిపోయారు.

8. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 5,938 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,77,814కి చేరుకుంది. 1,89,564 మంది కోలుకున్నారు. 88,250 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,683 మంది చ‌నిపోయారు.

9. మ‌హారాష్ట్ర‌లో కొత్త‌గా 10,441 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,82,383కు చేరుకుంది. 4,88,271 మంది కోలుకున్నారు. 1,71,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

10. ర‌ష్యా తాము డెవ‌ల‌ప్ చేసిన స్పుత్‌నిక్‌-వి క‌రోనా వ్యాక్సిన్‌కు గాను నెల‌కు 60 ల‌క్ష‌ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఆరంభంలో నెల‌కు 15 ల‌క్ష‌ల డోసుల‌ను ఉత్ప‌త్తి చేస్తారు. త‌రువాత 20 ల‌క్ష‌ల డోసుల‌కు కెపాసిటీని పెంచి దాన్ని 60 ల‌క్ష‌లు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version