మామకు ప్రేమతో.. నాగ్ బర్త్‌ డే సీడీపీని రిలీజ్ చేసిన సమంత..!

-

అక్కినేని కోడలు సమంత తాజాగా కింగ్ నాగార్జున బర్త్‌ డే సీడీపీని విడుదల చేసారు. అలాగే ఈ సీడీపీని విడుదల చేయడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానంటూ సామ్ ప్రకటించింది. అదేవిధంగా ఆయనపై ఎల్లవేళలా ప్రేమ, గౌరవం ఉంటుంది. అందరి గుండెల్లో ఎప్పుడూ ఆయన రాజే అని పేర్కొంది. ఆగస్ట్ 29న కింగ్ నాగార్జున పుట్టినరోజు కాగా వారం ముందే అభిమానులు సోషల్ మీడియాలో బర్త్‌ డే ట్రెండ్‌తో దిగిపోయారు. ఈ సీడీపీ విడుదల సందర్భంగా అక్కినేని అభిమానులు సమంతకు ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’తో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు నాగార్జున. అలాగే మరికొద్ది రోజుల్లోనే బుల్లితెరపై హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు. నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version