ఛత్తీస్గడ్ లో పెరుగుతున్న కరోనా కేసులు…!

-

మరో సారి కరోనా కేసులు పెరుగుతున్నవి. ఛత్తీస్గడ్ లో కరోనా కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కరోనా బాధితులు రాష్ట్రం లో ఏడు జిల్లాలకు చెందిన వాళ్ళని సమాచారం. గత 24 గంటల్లో కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్గఢ్ రాజధాని లో కరోనా బాధితుల సంఖ్య 51 కి చేరింది.

అయితే ఇప్పటికే 40 మంది కరోనా బాధితులు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సంఖ్య 51కి చేరింది దీంతో ఆందోళనకి దారి తీస్తోంది. రాయఘర్ కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో ఐదుగురికి కరోనా వచ్చినట్లు సమాచారం మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధ్యతలు సంఖ్య 131 కి చేరింది అయితే 31 మంది కరోనా బాధితులు హోమ్ ఐసోలేషన్ నుండి డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4182 శాంపిల్స్ ని పరీక్షించారట

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version