కరోనా అలెర్ట్… కలెక్టర్లు, అధికారులతో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.

-

ఓమిక్రాన్ కరోనా వేరియంట్ పై రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఓమిక్రాన్ వేరియంట్ పై ప్రధాన చర్చ జరిగింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు.. ఓమిక్రాన్  నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, సబితా, ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.

తాజాగా కేబినెట్ సబ్ కమిటీ జిల్లాల కలెక్టర్లతో, అధికారులతో సమావేశం అయింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా కరోనా పరిస్థితులు, రాష్ట్రంలో థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యశాలల్లో సదుపాయాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు దిశానిర్ధేశం చేయనుంది. అవసరమైన ఔషధాలు, పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించనుంది. ముఖ్యంగా కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగంగా ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాడానికి ఏర్పాటు అయింది. దీంతో రానున్న రోజులో ప్రజలకు మరింత వేగంగా వ్యాక్సిన్ చేసేలా జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు ఇవ్వనుంది కేబినెట్ సబ్ కమిటీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version