కరోనా థర్డ్ వేవ్ మొదలైందా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి యూరప్ పరిస్థితి చూస్తుంటే. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో యూరప్ వణికిపోతోంది. ప్రపంచంలో నమోదవుతున్న అన్ని కేసుల్లో సగం కేసులు యూరప్ దేశాల్లోనే నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గత వారం వ్యవధిలో యూరప్ దేశాల్లో 20 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. వారంతో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే మొదటి సారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చే సింది.
గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌ఓ) యూరప్ లో కరోనా కేసుల గురించి స్పందించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం యూరప్ లో దాదాపు 5 లక్షల మరణాలు సంభవించవచ్చని అంచానా వేసింది.