కోవిడ్ 19: వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని సోషల్ మీడియాలో పంచుకోవద్దు.. కేంద్రం

-

సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎగబడుతున్నారు. కరోనా నుండి రక్షించేది వ్యాక్సిన్ ఒక్కటే అని తేలిపోయిన తరుణంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి క్యూలు కడుతున్నారు. ఐతే వ్యాక్సిన్ వేయించుకునే ముందు కోవిన్ సైట్ లో రిజిస్టర్ చేయించుకోవాలని తెలిసిందే. ఒక్కసారి రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ వేయించుకున్నాక, వారికి కోవిన్ సైట్ నుండి సర్టిఫికేట్ వస్తుంది.

మొదటి డోస్ తో పాటు రెండవ డోసుకి కూడా సర్టిఫికేట్ వస్తుంది. ఐతే ఈ సర్టిఫికేట్లను సోషల్ మీడియాలో పంచుకోవద్దని కేంద్రం కోరింది. సైబర్ నేరగాళ్ళు అందులోని సమాచారంతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, అందువల్ల వ్యాక్సిన్ సర్టిఫికేట్ ని సోషల్ మీడియాలో పంచుకోకూడదని తెలిపింది. సర్టిఫికేట్ లో పేరు, చిరునామా, వ్యాక్సినేషన్ కేంద్రం, ఫస్ట్ డోస్, సెకండ్ డోసు మొదలగు వివరాలన్నీ ఉంటాయి. భవిష్యత్తులో ఇతర దేశాలు వెళ్ళాలంటే ఈ సర్టిఫికేట్ చూపించాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version