కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ మహమ్మారి నుండి బయట పడడం చాలా కష్టంగా ఉందని చెప్పాలి. అయితే కరోనాని కట్టడి చేయడానికి కోవిషీల్డ్, కొవ్యాక్సిన్ మరియు ఇతర వ్యాక్సిన్లు కూడా వచ్చాయి.
అయితే తాజాగా ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (Armed forces Medical services) చేసిన స్టడీ ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయి. ఇక దాని కోసం చూసేస్తే.. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారిపై పరిశోధన చేయగా.. ఇది కరోనా ఇన్ఫెక్షన్ ని 93 శాతం తగ్గిస్తుందని మరణాలను 98 శాతం తగ్గిస్తుందని తేలింది.
ఈ విషయాన్ని మంగళవారం నాడు డిఫెన్స్ మినిస్టరీ చెప్పారు. అయితే 15.95 లక్షల హెల్త్ కేర్ వర్కర్స్ మరియు ఫ్రంట్లైన్ వర్కర్స్ పైన ఇన్వెస్ట్ చేశారు. జనవరి 16వ తేదీన వాక్సినేషన్ డ్రైవ్ మొదలైంది.
అయితే ఈ పరిశోధనలో 93 శాతం కొత్త ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడం మరియు 98 శాతం మరణాలను తగ్గించడం చూడొచ్చు అని అంటున్నారు. అయితే ఈ ఒక్క స్టడీని ఆరోగ్యకరమైన పురుషుల మీద చేయడం జరిగింది అని మినిస్టరీ అన్నారు.
దీనిలో చిన్న పిల్లల్ని కానీ సీనియర్ సిటిజెన్స్ ని కానీ తీసుకోలేదని కేవలం ఆరోగ్యకరమైన పురుషులని మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించారు.