‘గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదు

-

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్సభలో బీజేపీ ఎంపీ భగీరథ్ చౌదరి అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. మరోవైపు భారత్లో 2006లో 1,411గా ఉన్న పులుల సంఖ్య.. 2022లో 3,682కి పెరిగినట్లు తెలిపారు. పులుల సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని చేరుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

‘జాతీయ జంతువు’గా పులిని, ‘జాతీయ పక్షి’గా నెమలిని 1972 వన్యప్రాణుల (రక్షణ) చట్టంలోని షెడ్యూల్-I నోటిఫై చేసిందని గుర్తు చేశారు. ఇంతకుముందు కూడా రాజస్థాన్ ప్రభుత్వ ఆధీనంలో నడిచే గోసంరక్షణ కేంద్రం హింగోనియ గోశాల దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన అనంతంర జస్టిస్ మహేష్ చంద్ర శర్మ ఈ సిఫారసులు చేశారు. సంతలో ఆవులను అమ్మరాదని కేంద్రం నిషేదం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వివిధ రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హైకోర్టు సిఫారసులు చర్చనీయాంశమయ్యాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version