సిసిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. షర్మిల పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షర్మిల పెట్టిన పార్టీకి నిర్మాత జగన్ మోహన్ రెడ్డి అయితే… డైరెక్టర్ కేసీఆర్ అని ఆరోపణలు చేశారు. ఇద్దరి సీఎంల అనుమతి లేకుండా షర్మిల… ఇలా చేస్తుందా ? మొత్తం ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని నిప్పులు చేరిగారు నారాయణ. సూది ఏపీలో పొగొట్టుకోని తెలంగాణ లో వేదికితే ఏం లాభం ఉంటుందని షర్మిలకు చురకలు అంటించారు.
రఘరామకృష్ణం రాజు…. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసారని.. రఘరామకృష్ణం రాజు సభ్యత్వం రద్దు చేయాలని వైసీపీ అంటుందని పేర్కొన్నారు. వీరి ఇరువురి నాటకాన్ని అమిత్ షా చూస్తున్నాడని… అమిత్ షా అండదండలు ఉన్నంత కాలం జగన్ కు బెయిల్ రద్దు కాదని స్పష్టం చేశారు. కోవిడ్ నియంత్రణ లో కేంద్రం పూర్తిగా విఫలం అయిందని.. తిరుపతి లో ఆక్సీజన్ లేక 23 మంది చనిపోతే 12 మంది అని చెప్పారని ఫైర్ అయ్యారు.
దేశంలో కార్పోరేట్ ఆసుపత్రులు కోవిడ్ వల్ల లాభపడ్డాయని… 64% వారి ఆస్తులు పెరిగాయన్నారు. అంబానీ, అదాని ఆస్తులు అమాంతంగా పెరిగాయని చెప్పారు. చనిపోయిన వారికి 5 లక్షల ఇవ్వలేని కేంద్రం… కార్పొరేట్ లకు లక్ష ఆరవై కోట్లు ఇచ్చిందని మండిపడ్డారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉందని… పబ్లిక్ సెక్టర్లు మొత్తం కేంద్రం అమ్మకానికి పెట్టిందని ఆగ్రహించారు.. దేశం లో ఇంత అవమానకరమైన ప్రధాని ఇంకోడు లేడని… ఉత్తర ప్రదేశ్ ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ దేశాభివృద్ధి మీద లేదన్నారు.