ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీఎం జగన్, వైఎస్ షర్మిల ఇద్దరూ ఒక్కటేనని.. తెలంగాణ, ఆంధ్రా అంటూ వాళ్లిద్దరి మధ్య గోడవలు పెట్టకండి అని పేర్కొన్నారు.
నీటి సమస్య పై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన ఆయన… చంద్రబాబు 14 సంవత్సరాల పరిపాలన కారణంగానే ఈ సమస్య వచ్చిందని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో రాష్ర్టం ఏడారిగా మారిపోయిందని ఫైర్ అయ్యారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ అంటే జగన్ కి ఇష్టమని…..అలాగే జగన్ అంటే కేసిఆర్ కి ఇష్టమని స్పష్టం చేశారు. జల వివాదం త్వరలోనే ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని.. జగన్, కేసిఆర్ మధ్య విభేదాలు తీసుకురావడానికి కోంత మంది ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.