విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో విశాఖలో ఉవ్వెత్తున్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ కేంద్రం నిర్ణయాన్ని అన్ని పార్టీలు తప్పుబడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్మాలో సీపీఐ నారాయణ పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆపగలరని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై వెంకయ్యనాయుడు స్పందించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను ఆపే శక్తి వెంకయ్యకు మాత్రమే ఉందన్నారు.
‘‘ దేశాన్ని, సంపదను అమ్మేస్తున్నారు. విశాఖకు అన్యాయం జరుగుతుంటే… కంభంపాటి హరిబాబు ఎందుకు మాట్లాడటంలేదు. విశాఖకు, స్టీల్ ప్లాంట్‌కు న్యాయం జరిగే వరకు మిజోరాం గవర్నర్‌గా వెళ్లనని హరిబాబు చెప్పాలి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ మిజోరాం గవర్నర్ పదవిని హరిబాబు తిరస్కరించాలి. స్టీల్ ప్లాంట్‌పై కోర్టుకు వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రజాపోరాటాలకు, ప్రాణ త్యాగానిని సిద్ధం కావాలి. ’’ సీపీఐ నారాయణ పిలుపు నిచ్చారు.