కెసిఆర్ ఎదురుతిరిగినా.. జగన్ మాత్రం మోడీకి వంగి వంగి దండాలు పెడుతున్నాడని ఫైర్ అయ్యారు నారాయణ. బీజేపీ-వైసీపీ బంధం చాలా అన్యోన్యంగా ఉందని.. తల వంచి.. మెడ వంచి.. జగన్ మోడీ జపం చేస్తున్నారని మండిపడ్డారు. హోదా, పోలవరం నిధులు ఏమయ్యాయి..? ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి కదా..? అని నిలదీశారు.
మోడీకి భయపడి, గజగజ వణుకుతూ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తాకట్టు పెట్టారు… రక్తసిక్త హస్తాలతో రాష్ట్రాలను నాశనం చేస్తోన్న మోడీ ,అమిత్ షాలను చూసి వణికిపోతున్నారని నిప్పులు చెరిగారు. నేటి వరకు మోడీ 24 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు,ఇంకో 100 అమ్మకానికి సిద్ధమయ్యారని.. గుజరాత్ వాళ్ళకే అన్ని అమ్ముతున్నారని ఫైర్ అయ్యారు.
డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు గుజరాత్ వాళ్లేనని.. కేసీఆర్ ఎదురు తిరిగినా.. జగన్ మాత్రం ఏమి మాట్లాడరని చెప్పారు. తీర ప్రాంతం అంతా గుజరాత్ వాళ్ళకే రాసిస్తున్నారు… బొగ్గు కొనుగోలు పై కేసీఆర్ ఎదురు తిరిగారు.. ఆదాని దగ్గర కొననని చెప్పారన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్ని కలిసి పోరాడాలని నారాయణ పిలుపు ఇచ్చారు.